
రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న ధ్రువ సినిమా పూర్తవగానే చెర్రి సుక్కు సినిమా చేయనున్నాడు. ఇప్పటికే సుకుమార్ ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశారట. అయితే ఇప్పటికే వారు తీసేది ఓ పల్లెటూరి ప్రేమకథని.. 25 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్లి పిరియాడికల్ మూవీ చూపిస్తారని అన్నారు.
అంతా బాగున్నా ఈ సినిమా టైటిల్ గా 'ఫేస్ బుక్ లైవ్ చాట్ @ 8.18 pm' అని పెట్టబోతున్నారట. అసలు కథకు ఈ టైటిల్ కు సంబంధం లేదనిపిస్తుంది. చెర్రి సుక్కు టైటిల్ ఇదే అయితే ఒకింత కన్ ఫ్యూజన్ మరో పక్క షాక్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాకు ఫార్ములా ఎక్స్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. లేటెస్ట్ గా ఫెస్ బుక్ లైవ్ చాట్ @ 8.18 pm అని బయటకు వచ్చింది. మరి ఈ రెండిటిలో ఏదైనా ఆ సినిమా టైటిల్ అయ్యే అవకాశం ఉందా లేక ఈ రెండు కాకుండా మరేదైనా టైటిల్ పెట్టబోతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.