పుష్ప-2 టీజర్‌ రిలీజ్ రేపే

సోమవారం అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. కనుక ఆయన హీరోగా నటిస్తున్న పుష్ప-2 సినిమా టీజర్‌ విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 11.07 గంటలకు టీజర్‌ విడుదల కాబోతోంది. ఈ విషయం పుష్ప-2 టీమ్ స్వయంగా ట్విట్టర్‌లో కొద్దిసేపటి క్రితమే వెల్లడించింది. 

ఈ సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశంలో అల్లు అర్జున్‌ స్త్రీ వేషధారణలో కనిపిస్తాడు. అదే వేషంలో అల్లు అర్జున్‌ తన బృందంతో కలిసి డాన్స్ చేస్తారు. ఇదే సూచిస్తున్నట్లు భగభగ మండే మంటల నేపధ్యంలో త్రిశూలం పట్టుకుని నృత్యం చేస్తున్న పోస్టర్ కూడా పెట్టారు. 

పుష్ప-2లో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2 సినిమాని ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాయి. 

ఈ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప-2 ఆగస్ట్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.