ఆహాలో ప్రేమలు... ఎప్పటి నుంచంటే

అతితక్కువ బడ్జెట్‌తో ఎటువంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరిలో విడుదలైన ‘ప్రేమలు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

గిరీష్ ఏడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమలు సినిమాలో నస్లెన్ కె గఫూర్, మాధ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు చేశారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీని అంతే చక్కగా తెరకెక్కించడంతో ఈ సినిమాతో యువత బాగా కనెక్ట్ అయ్యారు.

ఎక్కడ అశ్లీల అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను బాగానే ఆదరించారు. థియేటర్లలో మంచి టాక్, కలక్షన్స్‌ సంపాదించుకున్న ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ ఈ నెల 12 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. అదే రోజున డిస్నీ హాట్ స్టార్‌లో కూడా ప్రసారం కాబోతోంది.      

ఇదివరకు శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రేమలు ఎలా ఉంటాయో చక్కగా చూపారు. ఆ తర్వాత అలాంటి సినిమాలు అనేకం వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అటువంటి చక్కటి సినిమాయే ఈ  ప్రేమలు.

హీరో తొలి ప్రేమ విఫలం అవడం తర్వాత హైదరాబాద్‌లో గెట్ కోచింగ్ లో చేరడం, అక్కడ ఓ పెళ్ళిలో హీరోయిన్‌తో మళ్ళీ ప్రేమలో పడటం, ఆ తర్వాత వారి ప్రేమాయణం ఏవిదంగా సాగి ముగింపుకి చేరుకుందనేదే ఈ ప్రేమలు.