పుష్ప-2లో శ్రీవల్లి ఫస్ట్-లుక్ పోస్టర్‌... ఒంటి నిండా నగలే!

పుష్ప సినిమా మొదటిభాగంలో శ్రీవల్లి (రష్మిక మందన) నిరుపేద కుటుంబానికి చెందిన యువతి పాత్ర చేసింది కనుక అందుకు తగ్గట్లుగా సామాన్య దుస్తులలో కనిపించింది. కానీ ఆ సినిమా పూర్తయ్యేసరికి అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగిలింగ్ చేసి బాగా డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు.

ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 అక్కడి నుంచే మొదలవుతుంది. కనుక ఇప్పుడు శ్రీవల్లి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఫస్ట్-లుక్ పోస్టర్‌ని శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

పచ్చటి చీర, మ్యాచింగ్ జాకెట్, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఆమె చూడముచ్చటగా ఉంది. పుష్ప-2లోని ఓ పాటకు ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు తీసిన్నట్లు ఫోటో చూస్తే అర్దమవుతుంది.  

పుష్ప-2 సినిమాలో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది.