జీ5 ఓటీటీలో గామి ఎప్పటి నుంచి అంటే...

విధ్యాధర కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్‌ అఘోరాగా నటించిన గామి సినిమా మార్చి 8న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల మన్ననలు అందుకొని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఈ నెల 12 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో గామి సినిమా ప్రసారం కాబోతోందని జీ5 సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

ఈ సినిమాలో చాందినీ చౌదరి, అభినయ ముఖ్య పాత్రలలో నటించారు. 

అఘోరాగా మారిన శంకర్ (విశ్వక్ సేన్‌) మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. పైగా అతనికి గతం జ్ఞాపకం ఉండదు. ఈ కారణంగా అతనిని శాపగ్రస్తుడుగా భావించి అఘోరాలు తమ ఆశ్రమం నుంచి వెలివేస్తే, శంకర్ తనను తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెడతాడు.

ఈ క్రమంలో ఓ స్వాంజీ ద్వారా హిమాలయాలలో ద్రోణగిరి పర్వత శ్రేణుల మద్య 36 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వికసించే ఓ మాలిపాత్రలలో తన సమస్యకు పరిష్కార్మ్ ఉందని తెలుస్కొని అక్కడకు బయలుదేరుతాడు.

అనేక ప్రమాదాలను అధిగమిస్తూ అక్కడ్కి చేరుకొన్నాడు?అసలు అతను ఎవరు? ఏ జ్ఞాపకాలు గుర్తు లేకపోయినా  దేవదాసి దుర్గ (అభినయ), ఆమె కూతురు ఉమ (హారిక), సీటీ 333 (మహమ్మద్) ల జ్ఞాపకాలు మాత్రం ఎందుకు వెంటాడుతున్నాయి? అనేదే గామి సినిమా.