భరత నాట్యం ట్రైలర్‌... మామూలుగా లేదు కామెడీ!

కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్య తేజ ఏలె, మీనాక్షీ గోస్వామి ప్రధాన పాత్రలలో భరత నాట్యం సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.

ట్రైలర్‌లో కామెడీ చూస్తే మరో చక్కటి కామెడీ సినిమా చూడబోతున్నామని స్పష్టమవుతుంది. ఈ సినిమాలో హర్షవర్ధన్, హర్ష చెముడు, అజయ్ గోష్, మస్తాలి, టెంపర్ వంశీ, గంగవ్వ, శివన్నారాయణ, సంతోష్ బాలకృష్ణ, శాతహన, కృష్ణ, అల్లూరి, నాగ మహేష్‌, టార్జాన్, మాణిక్‌ రెడ్డి ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ: సూర్యతేజ ఆలె, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: సూర్యతేజ ఆలె, కెవిఆర్‌ మహేంద్ర,  సంగీతం: వివేక్‌ రామస్వామి సాగర్, కెమెరా: వెంకట్ ఆర్‌ శాఖమూరి, ఆర్ట్: బేబీ సురేశ్ భీమాగాని, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేశారు. ఈ సినిమాను పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ నిర్మించారు.