పుష్ప-2 టీజర్‌ వచ్చేస్తోంది ఏప్రిల్‌ 8న

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 సినిమా కోసం అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు సైతం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్‌ పుట్టినరోజు కనుక పుష్ప-2 సినిమా నుంచి ఏం అప్‌డేట్‌ వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, టీజర్‌ విడుదల చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఈ సినిమాలో గంగమ్మ జాతర సన్నివేశంలో అల్లు అర్జున్‌ మహిళ వేషంలో డ్యాన్స్ చేసిన పోస్టర్ ఇదివరకే విడుదల  చేశారు. 

టీజర్‌ పోస్టర్లో గజ్జెలు కట్టిన కాలుని మాత్రమే చూపించారు. బహుశః టీజర్‌లో గంగమ్మ జాతరలో అల్లు అర్జున్‌ డ్యాన్స్ మూమెంట్ కూడా చూపిస్తారేమో? 

పుష్ప-2లో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2 సినిమాని ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాయి. పుష్ప-2 సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.