టిల్లూ క్యూబ్ కూడా తీస్తాము: సిద్ధూ జొన్నలగడ్డ

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘డిజే టిల్లు’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ తీస్తే అది సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సక్సస్ మీట్  జరుపుతుండగానే ‘టిల్లూ క్యూబ్’ తీయబోతున్నట్లు సిద్ధూ జొన్నలగడ్డ ప్రకటించారు.

నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ, “టిల్లూ స్క్వేర్ హిట్ అయిన తర్వాత కొంతమంది మీడియా మిత్రులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రెండు సినిమాలకు కొనసాగింపుగా మరొకటి తీస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. వారి సలహా మాకు కూడా నచ్చింది. అందుకే ‘టిల్లూ క్యూబ్’ తీయాలని నిర్ణయించుకున్నాము. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తాము,” అని చెప్పారు.  

‘డిజే టిల్లు’ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. కానీ ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఆమె  కంటే చాలా హాట్ హాట్‌గా చేసింది. ఇప్పుడు ‘టిల్లూ క్యూబ్’లో కూడా అనుపమనే హీరోయిన్‌గా ఉంటుందా లేక సిద్ధూ జొన్నలగడ్డ మరో అందాల భామని తీసుకువస్తాడా? అనేది త్వరలో తెలుస్తుంది.    

మల్లిక్ రామ్ దర్శకత్వంలో మార్చి 29న  వచ్చిన ‘టిల్లూ స్క్వేర్’ మంచి కలక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్టూన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.