ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్డేట్ గురించి అందరూ ఆతృతగా ఎదురుచూస్తుండటంతో ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ‘వెల్కం టూ అంజనాద్రి 2.0’ అంటూ చిన్న వీడియో క్లిప్‌తో అప్డేట్ ఇచ్చారు. దానికి హనుమాన్ సినిమాలోని ‘రఘునందన’ పాటని జోడించారు.
ఈ సినిమా గురించి ఇదివరకు ప్రశాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ, “హనుమాన్ సినిమా కంటే వెయ్యిరెట్లు అలరించే విదంగా జై హనుమాన్ ఉండబోతోంది. ఈ సినిమాలో హీరో తేజా సజ్జా కాదు కానీ హనుమంతు అనే పాత్రలో నటిస్తాడు. హనుమంతుడిగా ఓ ప్రముఖ నటించబోతున్నారు. ఈ సినిమాలో హీరో హనుమంతుడే. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి 2025లో వీలైతే సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాకంటే ముందు మొదలుపెట్టిన ‘ఆధీర’, ‘మహాకాళి’ సినిమాలు కూడా చేస్తున్నాను,” అని అన్నారు.