సుహాస్ రెండు కొత్త సినిమాలకు ముహూర్తం

యువనటుడు సుహాస్ వారం రోజుల వ్యవధిలో రెండు కొత్త సినిమాలను ప్రారంభించాడు. ఒకటి మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్‌గా రామ్ గోదాల దర్శకత్వంలో  ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా కాగా బండ్ల సందీప్ రెడ్డి దర్శకత్వంలో సంగీర్తనా విపిన్ హీరోయిన్‌గా మరొకటి మొదలుపెట్టాడు. 

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంత బ్యానర్‌ దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో నాలుగవ సినిమాగా మొదలుపెట్టిన సినిమాకు   ఈ నెల 19న పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: సాయి శ్రీరామ్ చేస్తున్నారు. 

ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని దిల్‌రాజు చెప్పారు. సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలు ప్రకటించక ముందే ఈ ఏడాది మే 24న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో తెలియజేశారు.     

రామ్ గోదాల దర్శకత్వంలో ‘ఓ భామ అయ్యో రామా’ సినిమాకు శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో అనిత హంస నందిని, అలీ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: రధన్, కెమెరా: మణికందన్, ఆర్ట్: బ్రహ్మ కడలి చేస్తున్నారు. 

ఈ సినిమాని విఆర్ట్స్ అండ్ చిత్రలహరి బ్యానర్లపై హరీష్ శంకర్‌ నల్లా, ప్రదీప్ తాళ్ళు నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.