సుహాస్ కొత్త సినిమా ‘ఓ భామ అయ్యో రామా’ షురూ

యువ హీరోలలో విభిన్నమైన కధలను ఎంచుకొని చక్కటి సినిమాలు చేస్తున్న వారిలో సుహాస్ కూడా ఒకరు. అతను నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్రం థియేటర్లలో, ఓటీటీ ప్రేక్షకులను బాగా అలరించింది.

సుహాస్ తాజాగా రామ్ గోదాల దర్శకత్వంలో  ‘ఓ భామ అయ్యో రామా’ సినిమా ప్రారంభించాడు. ఈ సినిమాలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్‌రాజు, సుదర్శన్ రెడ్డి, దర్శకులు వశిష్ట మల్లాది, శైలేశ్ కొలను, విజయ్‌ కనకమేడల, రధన్, హాస్య నటుడు అలీ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సినిమాలో అనిత హంస నందిని, అలీ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: రధన్, కెమెరా: మణికందన్, ఆర్ట్: బ్రహ్మ కడలి చేస్తున్నారు. 

హరీష్ శంకర్‌ నల్లా, ప్రదీప్ తాళ్ళు నిర్మాతలకుగా వి ఆర్ట్స్ అండ్ చిత్రలహరి బ్యానర్లపై నిర్మించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. 

సినిమా పూజా కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్ చాలా ఆకట్టుకునేలా ఉంది.