లవ్ మీ నుంచి రావాలిరా... లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్

ఆశిష్, వైష్ణవి జంటగా నటిస్తున్న ‘లవ్ మీ’ సినిమా నుంచి ‘రావాలి రా...’ అంటూ సాగే హర్రర్ లిరికల్ వీడియో సాంగ్‌ శనివారం సాయంత్రం 4.05 గంటలకు విడుదలైంది. చంద్రబోస్ ఈ పాటకి కీరవాణి స్వరపరచగా అమలా చేబోలు బృందం ఆలపించింది.

ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి, కెమెరా: పీసీ శ్రీరామ్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.

అరుణ్ భైరవ్ పూడి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో రవి కృష్ణ, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షిత్ రెడ్డి, హాన్సీత రెడ్డి, నాగ మల్లాది నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్‌ 25న విడుదల కాబోతోంది.