బుల్లితెర బాద్షా ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించేలా చేసిన సినిమా జనతా గ్యారేజ్.. ఆ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద ఎంత కాసుల వర్షం కురిపించిందో తెలిసిందే. అయితే సినిమాను మా టివి వారు లాస్త్ మంత్ టెలికాస్ట్ చేశారు. బుల్లితెరలో కూడా గ్యారేజ్ అదిరిపోయే హిట్ సాధించింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం జనతా గ్యారేజ్ టి.ఆర్.పి రేటింగ్ పాయింట్స్ 20.69 అట. ఇదో రకంగా సెన్షేషనల్ రికార్డ్ అని చెప్పాలి.

బాహుబలి తర్వాత ఈ రేంజ్ టి.ఆర్.పి రేటింగ్ ఉన్న సినిమా ఇదే.. టెంపర్ తర్వాత తారక్ మళ్లీ తన రికార్డ్ తానే చైపేసుకున్నాడు. తారక్ కెరియర్ లో ఈ రేంజ్ టి.ఆర్.పి రేటింగ్ రావడం కూడా సరికొత్త రికార్డే. ఇక విశేషం ఏంటంటే ఆరోజు ఓ పక్క క్రికెట్ ఉన్నా కూడా ఈ రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ రావడం గొప్ప విషయమంటున్నారు. సో ఈ విధంగా చూస్తే బుల్లితెర మీద కూడా బాద్షా ఎన్.టి.ఆర్ అని ఒప్పుకోవాల్సిందే.