వర్మ నుండి 340 కోట్ల 'న్యూక్లియర్'...!

సంచలన దర్శకుడు వర్మ సడెన్ గా ఓ సెన్షేషనల్ న్యూస్ ఎనౌన్స్ చేశాడు. తన మొదటి ఇంటర్నేషనల్ మూవీ న్యూక్లియర్ మొదలు పెట్టబోతున్నా అంటూ వర్మ ఎనౌన్స్ చేశాడు. తనతో ఎన్నాళ్ల నుండో కలిసి ఉన్న సి.ఎం.ఏ సంస్థతో కలిసి 340 కోట్ల బడ్జెట్ తో న్యూక్లియర్ అనే హాలీవుడ్ సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు రాం గోపాల్ వర్మ.

వర్మ ఏంటి 340 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడం ఏంటి అని అందరు ఆశ్చర్యంలో పడ్డారు. సంచలనాలను సృష్టించడమే పనిగా పెట్టుకున్న వర్మ ఈ సినిమాను అమెరికా, చైనా, రష్యా, ఇండియన్ యాక్టర్స్ తో తీస్తారట. సినిమా కథాంశం న్యూక్లియర్ బాంబ్ మీద ఉంటుందని తెలుస్తుంది. ప్రపంచంలోని పరిస్తితులు ఎలా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీశాయో ఈ సినిమా తెలియపరుస్తుంది. ప్రతి సినిమాలో టెక్నికల్ గా అప్ గ్రేడ్ తో ఉండే వర్మ సడెన్ గా హాలీవుడ్ సినిమా ఎనౌన్స్ చేయడం నిజంగా గొప్ప విషయమే.