వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా వచ్చిన యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. సాధారణంగా ఇటువంటి దేశభక్తి, యాక్షన్ సినిమాలు ఏమాత్రం బాగున్న ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడాతో కలిసి వరుణ్ తేజ్ చేసిన ఈ ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిల పడింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళ్ వెర్షన్స్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్నాయి.
దీని తర్వాత వరుణ్ తేజ్ మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీలతో కలిసి కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపీ, రూపాక్షి, విజయరామ రాజు, జగదీష్, రాజ్ తిరాందాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: కరుణ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్, కెమెరా: కిషోర్ కుమార్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
దీనీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై విజేందర్ రెడ్డి, రజని తాళ్ళూరి కలిసి నిర్మిస్తున్నారు.