
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే, షూటింగ్ లొకేషన్లో ఎవరో రహస్యంగా చిత్రీకరించిన చిన్న వీడియో బిట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
నల్ల లుంగీ, నల్ల చొక్కా ధరించి ఉన్న జూ.ఎన్టీఆర్ ఓ సెలయేరులో నుంచి ఒడ్డుకు నడుచుకు వస్తున్న సన్నివేశం అది. సోషల్ మీడియాలో ఈ వీడియో బిట్ వైరల్ అవుతోంది. దేవర లొకేషన్ నుంచి ఈవిధంగా వీడియో లీక్ అవడంతో యూనిట్ అప్రమత్తమైంది.
దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా: ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో దేవర సినిమాను నిర్మిస్తున్నారు.
దేవర సినిమాని రెండు భాగాలుగా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది.