రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమా కొబ్బరికాయ కొట్టేశారు

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్ జంటగా ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న సినిమాకి నిన్న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి, జాన్వీ కపూర్ తండ్రి బోణీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, నాగవంశీ, ననీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్న ఏఆర్ రహమాన్, ఇంకా రామ్  అచంట, శిరీష్మ సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ముహూర్తపు షాట్‌కి రామ్ చరణ్‌, జాన్వీ కపూర్ మీద చిరంజీవి క్లాప్ కొట్టగా, బోణీ కపూర్ కెమెరా స్విచ్ ఆన్‌ చేయగా, శంకర్ గౌరవ్ దర్శకత్వం చేశారు. 

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి.