పారిజాత పర్వం టీజర్‌ ఓకే! సినిమా ఎలా ఉంటుందో?

సంతోష్ కంబంపాటి దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో ‘పారిజాత పర్వం’ క్రైమ్-కామెడీ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కాబోతోంది. టీజర్‌ మొదట చాలా సీరియస్‌గానే మొదలైనప్పటికీ కామెడీగా ముగించడం బాగుంది. టీజర్‌లో సునీల్ చేతి మీద ‘జై చిరంజీవ’ అనే టాటూ చూపించి మెగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంతోష్ కంబంపాటి, సంగీతం: రీ, కెమెరా: బాల సరస్వతి, ఎడిటింగ్: శశాంక్ వుప్పుటూరి, ఆర్ట్: ఉపేందర్ రెడ్డి చేస్తున్నారు. 

వనమాలి క్రియెషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేశ్ కలిసి పారిజాత పర్వం సినిమా నిర్మిస్తున్నారు.