టిల్లు స్క్వేర్ నుంచి ఓ మై లిల్లీ లిరికల్ వీడియో సాంగ్‌

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ‘ఓ మై లిల్లీ...’ అంటూ సాగే మంచి రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్‌ నిన్న విడుదలైంది. సిద్ధూ, రవి ఆంటోనీ వ్రాసిన ఈ పాటని అచు రాజమణి స్వరపరచగా, దానిని శ్రీరామ చంద్ర అద్భుతంగా పాడారు.  

నేహా శెట్టి హీరోయిన్‌గా చేసిన డిజే టిల్లు సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’వస్తోంది. అయితే దీనిలో హీరోయిన్‌గా చేసిన అనుపమ పరమేశ్వరన్ చాలా రెచ్చిపోయి హాట్ హాట్‌గా చేసింది. ఏమంటే “ప్రతీరోజూ బిర్యానీ తినలేము కదా? అలాగే ఇదీను” అని గట్టిగా సమర్ధించుకుంది. ఈ సినిమాలో సిద్దూని అనుపమ డామినేట్ చేస్తుందన్నట్లు ఉన్నాయి ఆమె హాట్ హాట్ స్టిల్స్! 

ఈ సినిమాకి సంగీతం: రామ్ మిర్యాల, అచు రాజమణి, కెమెరా: సాయి ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్టూన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. టిల్లుస్క్వేర్ మార్చి 29న విడుదల కాబోతోంది.