
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, ఆ రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీ అయిపోవడంతో, ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అంటే జూన్ 4వరకు ఏ సినిమా కూడా పూర్తిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి ఏపీలో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం భాగస్వామిగా ఉంటారు. కనుక ఆ కారణంగా కొత్తగా మరే సినిమాలు చేయలేకపోవచ్చు. కానీ ఇప్పటికే సగం పూర్తిచేసిన హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలను జూన్ నుంచి మొదలుపెట్టి పూర్తి చేయడం ఖాయమే.
పవన్ కళ్యాణ్ సినిమాల కోసం నిరాశ నిస్పృహలతో ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ‘భగత్ బ్లేజర్’ పేరుతో సినిమాలోని చిన్న వీడియో క్లిప్పింగ్ మంగళవారం సాయంత్రం రిలీజ్ చేశారు.
దీనిలో పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిsనటిస్తోంది. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రాష్ట్రవ్యాప్తంగా శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.