ఓం భీమ్ బుష్... ట్రైలర్‌ నో లాజిక్... ఓన్లీ మాజిక్!

శ్రీహర్ష కొంగుగంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలలో వస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓం భీమ్ బుష్.’ ఈ సినిమా సబ్ టైటిల్‌ నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్ అని ముందే ప్రకటించారు.

కనుక లాజిక్ గురించి ఆలోచించకుండా నిన్న విడుదలైన ట్రైలర్‌ చూస్తే ఈ సినిమా మంచి కామెడీ పండించబోతోందని స్పష్టమవుతోంది. గ్రామంలో అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం బాంగ్ బ్రదర్స్ అంటూ వారు ముగ్గురూ చేసే కామెడీ చూసి తీరాల్సిందే.

ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీహర్ష, సంగీతం: సన్నీ ఎంఆర్, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: విజయ్‌ వర్ధన్ కుమార్, యాక్షన్: వింగ్ చున్ అంజి, కొరియోగ్రఫీ: విజయ్‌ బిన్నీ, శిరీష్, వీఎఫ్ఎక్స్: బాలాజీ ముప్పల. వి.సెల్యూలాయిడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సునిల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 22న విడుదల కాబోతోంది.