
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిధిగా కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో అంగరంగ వైభవంగా జరిగింది. పవన్ వస్తున్నాడు అని తెలియడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంతా సప్తగిరి ఆడియో వేడుకకు వచ్చారు. ఇక సప్తగిరి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ తనతో నాకు పరిచ్యం లేదు గబ్బర్ సింగ్ లో ఓ సీన్ చూసి కలవాలనుకునా కాని కుదరలేదు కాని ఈరోజు ఇక్కడకు రావాల్సి వచ్చింది.
కాటమరాయుడు సినిమా టైటిల్ అడగ్గానే ఇచ్చేసిన సప్తగిరి అండ్ టీంకు తన ధన్యవాదాలు.. టైటిల్ విషయంలో వారిచ్చిన సపోర్ట్ చూపించిన ఔదార్యం నాకు నచ్చింది. టైటిల్ విషయంలో ఇలా జరిగిందని నాకు తర్వాత తెలిసి సిగ్గు పడ్డాను. అందుకే సప్తగిరి కోసం ఈ ఆడియో వచ్చా. తనకు ఆశీర్వదించడం లాంటివి రావని.. అభిమానంతో పిలిచారు వచ్చా అని అన్నారు పవన్. ఇక తను చేసిన సినిమాలే తాను చూడలేని పరిస్థితి అని అయినా సరే సప్తగిరి సినిమా కచ్చితంగా చూడాలనుకుంటున్నా అన్నారు పవర్ స్టార్.
సప్తగిరి ఆడియోకి పవర్ స్టార్ వచ్చిన తీరు చూస్తే అదేదో ఓ పెద్ద హీరో సినిమా ఆడియో రేంజ్లో ఫ్యాన్స్ హంగామా జరిగింది. మరి ఇదే ఉత్సాహం సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా చూపిస్తే మనోడు సూపర్ సక్సెస్ కొట్టేసినట్టే.