
కుబేర కోసం బ్యాంకాక్ చేరుకున్న నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలలో కుబేర అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కోసం నాగార్జున బ్యాంకాక్ చేరుకున్నారు. కుబేరా షూటింగ్‌లో నాగార్జునతో పాటు మరికొందరు ముఖ్యమైన నటులు పాల్గొంటున్నారు. బ్యాంకాక్‌లో ప్రధానం కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మాఫియా గ్యాంగ్ నేపద్యంతో శేఖర్ కమ్ముల కధ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో ధనుష్ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు.
కుబేరలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.