
మాటల మాంత్రికుడు త్రివిక్రం.. మాటల తూటాలతో సినిమాలను విజయవంతం చేసుకునే ఈ దర్శకుడు తన సత్తా ఏంటో సినిమా సినిమాకు తెలియచేస్తున్నాడు. స్టార్ హీరోతో తీసినా కుర్ర హీరోతో తీసినా తన సినిమాకు ఉండే రేంజ్ మాత్రం ఒకేవిధంగా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఏబిసి అనే డిజిటెల్ టెక్నాలజీ సంస్థ 'Trivikram Srinivas' అనే యాప్ డెవెలప్ చేస్తుంది.
ఈ యాప్ ద్వారా త్రివిక్రం బయోగ్రఫీ.. ఫిల్మోగ్రఫీతో పాటుగా తన సినిమాలోని పంచ్ లను ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు త్రివిక్రం సినిమాల్లోని పాటలు, మాటలు అన్ని ఇందులో ఉంటాయట. ప్రస్తుతం ఆండ్రాయిడ్ కస్టమర్స్ కోసం డెవలప్ చేసిన ఈ యాప్ త్వరలోనే అన్ని ఫ్లాట్ ఫామ్స్ కు అందుబాటులో ఉండేలా చేస్తారట.
ఓ దర్శకుడి గురించి ఈ విధంగా యాప్ క్రియేట్ చేయడం గొప్ప విషయమని చెప్పాలి. ఈరోజు త్రివిక్రం శ్రీనివాస్ పుట్తినరోజు సందర్భంగా ఈ యాప్ రిలీజ్ చేస్తున్నారట. మరి మీకిష్టమైన దర్శకుడి టోటల్ సమాచారం ఓ యాప్ ద్వారా అందించడం మంచి ప్రయత్నమే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఈ యాప్ అప్డేట్ చేస్తుంటారట మేకర్స్. మరి ఈ యాప్ యొక్క అసలు విషయం ఏంటో ఒక్కసారి మీరు డౌన్ లోడ్ చేసుకుని చూడండి.