కళ్యాణి వచ్చా వచ్చా... ఫ్యామిలీ స్టార్‌ సెకండ్ సింగిల్

పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని రెండో లిరికల్ వీడియో సాంగ్‌ మంగళవారం సాయంత్రం విడుదలైంది. 

కళ్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే ఈ పెళ్లిపాటని అనంత్ శ్రీరామ్ వ్రాయగా, గోపీ సుందర్ చక్కగా స్వరపరిచారు. మంగ్లీ, కార్తీక్ బృందం హుషారుగా ఆలపించిన ఈ పాటకి విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ తదితరులు అంతే హుషారుగా డ్యాన్స్ చేశారు.

 శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.