దిల్ రాజు మెగా ప్లాన్..!

ఒకే వేదిక మీదకు టాలీవుడ్ టాప్ హీరోలంతా వస్తే.. అహా ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్లు చాలవు కదా.. కాస్తా కూస్తో చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు అయినా ఒకసారి కాకపోతే ఒకసారి అందరు ఒకే ఈవెంట్ కు అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి కాని స్టార్ హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా అందరు కలిసిన సందర్భం చాలా తక్కువ.  

అవార్డ్ ఫంక్షన్స్ లో కూడా ఏదో అవార్డ్ దక్కించుకున్న హీరో మాత్రమే వచ్చి సందడి చేస్తాడు తప్ప మన వాళ్లంతా ఒక్కసారిగా ఒకే వేదిక మీద కనిపించిన దాఖలాలు లేవు. అయితే అలాంటి మెగా ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నాడు దిల్ రాజు. తను తీస్తున్న 25వ సినిమా శతమానం భవతి ఆడియోకి తన 24 సినిమాల్లో నటించిన హీరోలందరిని ఇన్వైట్ చేస్తున్నాడట. ఒకవేళ వారందరు వస్తే కనుక ఈ దశాబ్ధపు పెద్ద ఈవెంట్ ఇదే అని చెప్పొచ్చు. ఒక హీరో ఆడియోకి మరో హీరో రావడం చాలా అరుదు మరి తనతో సినిమాలు చేసిన స్టార్స్ అందరిని దిల్ రాజు తన సినిమా ఆడియోకి పిలిపించడం మాములు విషయం కాదు. 

ఈ నెల చివర్లో జరిగే ఈ ఆడియోకి ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫ్యాన్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉండటంతో ఏదైనా అవుట్ డోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరుపనున్నారట. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటించిన శతమానం భవతి సినిమాను సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నాడు.