
విజయ్ దేవరకొండకు గీతా గోవిందం వంటి సూపర్ హిట్ సినిమా అందించిన పరశురామ్ దర్శకత్వంలో ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తుండటంతో దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుండటంతో అంచనాలు ఇంకా పెరిగాయి.
ఇటీవల విడుదలైన “ఏమిటిది చెప్పీ చెప్పక ఎంత చెప్పిందో....” అంటూ చాలా మృధుమధురంగా సాగే లిరికల్ వీడియో సాంగ్, టీజర్ రెండూ కూడా ఫ్యామిలీ స్టార్‌పై అంచనాలు పెంచాయి. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు కళ్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే (పెళ్లిపాట) లిరికల్ వీడియో సాంగ్ని విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది.
#FamilyStar - Song 2
It's a Wedding song :)#KalyaniVacchaVacchaa. pic.twitter.com/J7dcAWlNIF