సందీప్ కిషన్ తాజా సినిమా ‘ఊరి పేరు భైరవకోన’ సూపర్ హిట్ అనుకోలేము కానీ థియేటర్లలో బాగానే ఆడింది. బాగానే కలెక్షన్స్ రాబట్టుకొని అప్పుడే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. దాని తర్వాత సందీప్ కిషన్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తన 30వ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ కలిసి నిర్మించబోతున్నాయి. మాస్ మహరాజ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ అందించిన నక్కిన ధర్మారావుతో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాయి.
ఈ సినిమాకు కధ, మాటలు: బెజవాడ ప్రసన్న కుమార్ అందించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను ప్రకటిస్తామని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయి.