ఆపరేషన్ సక్సస్... వేలంటైన్ ఓటీటీలోకి!

శక్తి ప్రతాప్ సింగ్‌ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వేలంటైన్’ పాన్ ఇండియా మూవీగా చాలా భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. సాధారణంగా దేశభక్తి, యాక్షన్, రొమాన్స్, భావోద్వేగాలు కలగలిపిన ఇటువంటి సినిమాలు అందరినీ ఆకర్షిస్తుంటాయి కనుక సూపర్ హిట్ అవుతుంటాయి. 

కానీ పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్‌ వాయుసేన పాకిస్తాన్ భూభాగంలో ప్రవేశించి ఉగ్రవాదుల శిభిరాలను ద్వంసం చేయడం తదితర అంశాలతో తెర కెక్కించిన ఈ ‘ఆపరేషన్ వేలంటైన్’ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ హీరోయిన్‌గా నటించింది.

సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా దాని అంతిమ గమ్యం ఓటీటీలే కనుక ఈ ఆపరేషన్ ఫెయిల్ అయినప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోంది. ఈ నెల 29 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ఆపరేషన్ వేలంటైన్ ప్రసారం కాబోతోంది. అంటే సినిమా విడుదలైన నెలరోజులు కూడా తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చి పడుతోందన్న మాట! అయితే ముందుగా తెలుగు ఆ తర్వాత తమిళ్, కన్నడం మలయాళ వెర్షన్స్, చివరిగా హిందీ వెర్షన్ ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది.