సాయి దుర్గ తేజ: కొత్త పేరుతో కొత్త వ్యాపారం !

సాయి ధరమ్ తేజ్ తల్లి పేరు విజయదుర్గ. ఇటీవల తన పేరులో ‘ధరమ్’ తొలగించుకొని దాని స్థానంలో తల్లి పేరుని కలుపుకొని ‘సాయి దుర్గ తేజ’గా మార్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తల్లి పేరుతో ‘విజయ దుర్గ ప్రొడక్షన్స్’ అనే సినీ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత రాజు దీనిని ప్రారంభించారు. తన మావయ్యలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు ముగ్గురు ఆశీర్వాదాలతో ఈ సంస్థని ఏర్పాటు చేస్తున్నట్లు సాయి దుర్గ తేజ చెప్పారు. 

తనకు తన తల్లి అంటే చాలా ఇష్టమని ఎల్లప్పుడూ ఆమె తన వెంటే ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమెను తన పేరులో పెట్టుకున్నానని చెప్పారు. తన తల్లి పేరుతో ఇప్పుడు సినీ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిజానికి తాను సినిమాలలో నటించడం ప్రారంభించినప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేదని, ఇన్నేళ్ళకు ఆ కోరిక నెరవేరిందని అన్నారు.