పాకిస్తాన్ జైల్లో నాగ చైతన్య ... తండేల్!

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా టీజర్‌ విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్ళినప్పుడు, గుజరాత్‌ తీరంలో పాకిస్థానీ కోస్ట్ గార్డ్ చేతుల్లో చిక్కుకుంటారు. 

ఓ యధార్థ గాథ, ఘటనల ఆధారంగా చందూ మొండేటి ఈ సినిమాని తీస్తున్నారు. దీనిలో మత్స్యకారుడుగా నటిస్తున్న నాగ చైతన్య పాకిస్తాన్ జైల్లో చిక్కుకుంటాడు. అతని కోసం సముద్ర తీరం వద్ద ఎదురుచూపులు చూస్తుంటుంది హీరోయిన్‌ సాయి పల్లవి అని టీజర్‌లో చూపారు. మంచి కంటెంట్‌తో ఈ సినిమా సిద్దమవుతోంది కనుక నాగ చైతన్యకు ఇది హిట్ ఇస్తుందని భావించవచ్చు.     

నాగ చైతన్య 23వ సినిమాగా వస్తున్న ‘తండేల్‌’కు దర్శకత్వం: చందూ మొండేటి, కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.