సుహాస్ ప్రసన్న వదనం టీజర్‌... మరో గజినీ సినిమా?

యువతరం నటులలో చక్కటి సినిమాలను అందిస్తున్న హీరో సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో అందరినీ అలరించాడు. దాని తర్వాత అర్జున్ వైకే దర్శకత్వంలో ‘ప్రసన్న వదనం’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

హీరో తలకి గాయమవడం వలన ఎవరి మొహాలను గుర్తించలేని ఓ అరుదైన సమస్య ఏర్పడినప్పుడు తనకు ఆ స్థితి కల్పించినవారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. కనీసం కుటుంబ సభ్యుల మొహాలను కూడా గుర్తుపట్టలేక ఇబ్బంది పడుతున్న హీరో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?అనేది టీజర్‌లో చూపించారు. అంటే గజినీ సినిమా టైప్ అనుకోవచ్చన్న మాట! సుహాస్‌ చాలా చక్కగా నటించాడు. 

ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్‌ నాయుడు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని, ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అర్జున్ వైకే, సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: ఎస్‌.చంద్రశేఖర్న్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్‌, ఆర్ట్: క్రాంతి ప్రియం చేశారు. 

లిటిల్ థాట్స్, అర్హా మీడియా బ్యానర్లపై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి టీఆర్ కలిసి నిర్మించిన ఈ సినిమా అతి త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోందని టీజర్‌లో తెలియజేశారు.