బాలకృష్ణ-బాబీ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌

భగవంత్ కేసరితో హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాబాబి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేశారు.

కార్చిచ్చు అంటుకున్న ఓ దట్టమైన అడవిలో బాలకృష్ణ ఓ కారులో నుంచి దిగి ఓ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు విలన్‌ గ్యాంగ్ చుట్టుముట్టి 'వార్ డిక్లేర్ చేశావా?' అని అడిగితే బాలకృష్ణ బాక్సులో నుంచి బాటిలో తీసి తాగుతూ “సింహం నక్కలని వేటాడితే అది వార్ కాదురా లఫూట్... హంటింగ్...” అంటూ విలన్‌ గ్యాంగ్‌ని ఊచకోత కోసిన్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో చూపారు.  

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.   

ను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.