అమెజాన్ ప్రైమ్‌లో ఊరు పేరు ‘భైరవకోన... నేటి నుంచే

సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఊరు పేరు ‘భైరవకోన’ సినిమా ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్, కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. నేడు మహాశివరాత్రి సందర్భంగా అమెజాన్ ప్రైమ్‌లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది. 

వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమాలో సందీప్ కిషన్, వైవా హర్ష, కావ్య థాపర్, వర్షా బొల్ల ముఖ్యపాత్రలలో నటించారు.

గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అంటూ ముందే ఆకట్టుకొని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగారు దర్శకుడు ఆనంద్. భైరవకోనలో జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు, వాటిని మలిచిన తీరు, తెరకెక్కించిన విధానం అన్నీ ప్రేక్షకులను కుర్చీలలో కూర్చోబెట్టగలిగాయి.

ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు కూడా హాయిగా తమ ఇళ్ళలో కూర్చొని భైరవకొనలో హీరో సందీప్ కిషన్ గ్యాంగ్ ఏమేమి చేసిందో చూసి ఆనందించవచ్చు.