మా అమ్మాయి పేరు లీలాదేవి: శర్వానంద్

బుధవారం శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి ఆయన నటిస్తున్న మూడు సినిమాల అప్‌డేట్స్ అందించి అభిమానులకు చాలా సంతోషం కలిగించారు. ఆయన వ్యక్తిగతంగా మరో శుభవార్త కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే తమకు పాప పుట్టిందని, ఆమెకు లీలాదేవి మైనేని అని పేరు పెట్టిన్నట్లు అభిమానులకు తెలియజేశారు.

శర్వానంద్, రక్షిత దంపతులు తమ పాపతో దిగిన ఓ ఫోటోని కూడా అభిమానులతో పంచుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమెతో ఏడాది క్రితం వివాహం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. కానీ వారికి పాప పుట్టిందన్న విషయం ఎవరికీ తెలీకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దంపతులను అభినందిస్తున్నారు. 

నిన్న శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న ‘మనమే’, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వా 36, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వా37 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న మరో సినిమా పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.