శర్వా పుట్టినరోజున ఒకేసారి రెండు సినిమా అప్‌డేట్స్

నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న రెండు సినిమాలకు సంబందించి అప్‌డేట్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాయి సదరు సినీ సంస్థలు. వాటిలో ఒకటి శ్రీరామ్ ఆధిత్య  దర్శకత్వంలో వస్తున్న ‘మనమే’ ఫస్ట్ గ్లిమ్స్‌ కాగా మరొకటి అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వా36 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వా ‘బైక్ రేసర్‌’ పాత్రలో నటించబోతున్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌తో చెప్పేశారు. 

ఈ సినిమాలో శర్వాకు జోడీగా మాళవిక నాయర్ నటించబోతోంది. ఈ సినిమాకు సంగీతం: గిబ్రన్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటింగ్: అనిల్ కుమార్‌ పి, ఆర్ట్: ఏ పన్నీర్ సెల్వమ్, బ్యానర్ యూవీ క్రియెషన్స్, నిర్మాతలు: వంశీ, ప్రమోద్.