
టాలీవుడ్‌లో నాచురల్ స్టార్ నాని తర్వాత అటువంటి ఇమేజ్ ఉన్న నటుడు శర్వానంద్. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు నిర్మాత టిజి విశ్వప్రసాద్ చిన్న గిఫ్ట్ ఇచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిస్తున్న మనమే సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వరల్డ్ ఆఫ్ మనమే పేరుతో నేడు విడుదల చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం శ్రీరామ్ ఆధిత్య, డైలాగ్స్: అర్జున్, కార్తీక్, ఏఆర్ టాగూర్, వెంకట్ డి పతి, సంగీతం: హెషామ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: విష్ణుశర్మ, జ్ఞాన శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి, శ్రష్టి వర్మ, విజయ్ పోలకి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జానీ షేక్, స్టంట్స్: రియల్ సతీష్, కెఎన్ఆర్ (నిఖిల్) చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ రామస్వామి కూచిభొట్ల సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.