ఫ్యామిలీ స్టార్‌ అందరినీ అలరించే సినిమాయే... పక్కా

పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా టీజర్‌ మంగళవారం విడుదలైంది. ఊహించిన్నట్లే ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్ ఆడియన్స్‌ని మెప్పించేలా ఉండబోతోందని టీజర్‌ ద్వారా స్పష్టం చేశారు దర్శకుడు పరశురామ్. ఓ మద్య తరగతి కుటుంబం కుర్రాడు ఏవిదంగా ఉంటాడో చూపిస్తూనే, విజయ్‌ దేవరకొండలో రౌడీ హీరోని కూడా టీజర్‌లో చక్కగా చూపారు.    

ఈ సినిమాలో దివ్యాంక్ కౌశిక్, వాసుకి, రోహిణీ అట్టాంగడి,అభినయ, అజయ్ ఘోష్, జబర్దస్ట్ రామ్ ప్రసాద్, కోట జయరాం ముఖ్యపాత్రలు చేశారు. ఫ్యామిలీ ఫ్యామిలీ స్టార్‌ ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.