
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాళిని ఠాకూర్ జంటగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. “ఏమిటిది చెప్పీ చెప్పక ఎంత చెప్పిందో....” అంటూ సాగే మొదటి మెలోడియస్ లిరికల్ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది.
ఇప్పుడు సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు టీజర్ విడుదల చేస్తామని చెపుతూ పంచెకట్టులో ఓ చక్కటి పోస్టర్ కూడా అభిమానులతో పంచుకున్నాడు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.