
ప్రముఖ నటి నయనతార, కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు విగ్నేశ్ శివన్ మద్య మనస్పర్ధలు వచ్చాయా? ఇద్దరూ విడిపోబోతున్నారా? అంటే అవుననే అనుమానించక తప్పదు. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త విగ్నేశ్ శివన్‌ను అన్-ఫాలో చేశారు. దాంతో వారిరువురి మద్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, విడిపోబోతున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైపోయాయి.
కానీ నయనతార మళ్ళీ కొద్ది సేపటి తర్వాత భర్తని ‘ఫాలో’ చేయడంతో ఊహాగానాలు మారాయి. ఆమె పొరపాటున అన్-ఫాలో చేశారని కానీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడం చూసి తప్పుని సరిదిద్దుకున్నారని కొందరు వ్యాఖ్యలు చేస్తుంటే, అదేమీ కాదు వారిద్దరూ విడిపోబోతున్నారు... కానీ పిల్లల కోసమే రాజీపడి కలిసి జీవిస్తున్నారంటూ మరికొందరు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
నయనతార, విగ్నేశ్ శివన్ సుమారు ఏడేళ్ళు సహజీవనం చేసిన తర్వాత 2022లో మహాబలిపురంలో అట్టహాసంగా పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత 5-6 నెలలకే అద్దె గర్భం (సరోగసీ) విధానం ద్వారా వేరే మహిళకు జన్మించిన కవలలను దత్తత తీసుకొని అపురూపంగా పెంచుకుంటున్నారు.
నయనతార ప్రస్తుతం ఎస్.శశికాంత్ దర్శకత్వంలో ఆర్.మాధవన్, సిద్దార్ధ్ లతో కలిసి ‘టెస్ట్’ అనే సినిమాలో నటిస్తున్నారు.