టోక్యో విమానాశ్రయంలో రష్మికకు ఘన స్వాగతం

పుష్ప సినిమాతో యావత్ దేశంలో అభిమానులను సంపాదించుకొని ‘నేషనల్ క్రష్’ అని పేరు సంపాదించుకున్న రష్మిక మందన, ‘యానిమల్’ సినిమాతో ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా పాపులర్ అయిపోయింది. జపాన్‌లో క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతోంది. దానికి ఆమె భారత్‌ తరపున ప్రతినిధిగా హాజరవుతోంది. ఆమె టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు, అక్కడ జపనీస్ అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలకడంతో చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. వారు ఆమె నటించిన సినిమాలలోని ఫోటోలు అంటించిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వాగతం పలికేసరికి ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.   

 రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాలో మళ్ళీ అల్లు అర్జున్‌కి హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్‌ హీరో ధనుష్ 51వ చిత్రంలో నటిస్తోంది.