గుంటూరు కారం సెట్స్‌లో విశ్వంభర షూటింగ్‌!

త్రివిక్రమ్ శ్రీనివాస్‌-మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం అభిమానులకు నిరాశ పరిచి వెళ్ళిపోయింది. ఆ సినిమా కోసం హైదరాబాద్‌ శివార్లలో వేసిన మహేష్‌ బాబు ఇంటి సెట్ మాత్రం మెగాస్టార్ చిరంజీవికి ఉపయోగపడుతుండటం విశేషం.

మల్లాది వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కొన్ని ముఖ్య సన్నివేశాలను, ఒక ఫ్యామిలీ సాంగ్‌ని ప్రస్తుతం ఆ ఇంట్లోనే చిత్రీకరిస్తున్నారు. 

ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా నటిస్తున్నారు. ఆయనకు హీరోయిన్లుగా త్రిష, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాధ్, మరో ఇద్దరు ఆయన చెల్లెళ్ళుగా నటిస్తున్నారు. విశ్వంభరకు కావలసిన్నట్లు ఇంటి సెట్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొని వారందరిపై ఆ ఇంట్లో ఓ ఫ్యామిలీ సాంగ్‌ చిత్రీకరిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. దీనిలో ఆరు        పాటలుంటాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలిపారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.