
బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో తన సినిమాల వేగాన్ని పెంచిన మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా పూర్తి కాకముందే తను చేయబోయే తర్వాత సినిమా కొరటాల శివ మూవీకి ముహుర్తం పెట్టేస్తున్నారు. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ముహుర్తం నవంబర్ 9న పెట్టబోతున్నారట. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించే అవకాశాలున్నయట.
'భరత్ అను నేను' టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా కొరటాల మార్క్ మెసేజ్ తో కూడా కమర్షియల్ సినిమాగా రాబోతుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ మహేష్ తో తీసే సినిమా ఆ స్థాయి హిట్ అందుకునేలా స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 70-80 కోట్ల దాకా ఉంటుందని అంచనా.
ఓ పక్క మురుగదాస్ సినిమానే భారీ అంచనాలతో వస్తుంటే ఇప్పుడు కొరటాల మూవీ కూడా మహేష్ ఫ్యాన్స్ ను పండుగ చేసుకునేలా చేస్తుంది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే మహేష్ కొరటాల శివ మూవీ 2017 దసరా బరిలో దిగనుందట.