చిరు సినిమాకు మరో రైటర్..!

9 ఏళ్ల్ల తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఎలాగైనా సినిమా హిట్ కొట్టేయాలనే ఉద్దేశంతో పరిశ్రమలో బెస్ట్ అనుకున్న వారందరిని వాడేస్తున్నాడు వినాయక్. కత్తి రీమేక్ గా చిరు చేస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాకు ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ పనిచేస్తుండగా ఇటీవల సాయి మాధవ్ ను కూడా తన మాటల సహకారం అందించమని కోరినట్టు టాక్. ఇక ఇప్పుడు మరో రైటర్ హుస్సెన్ షాని కూడా ఖైదిలో భాగస్వామ్యం చేస్తున్నారట.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హుస్సెన్ టాలెంట్ సుక్కు రెండు మూడు సార్లు ప్రస్థావించాడు. అంతేకాదు హుస్సెన్ ఏకంగా ఓ సినిమాను డైరెక్ట్ చేశాడు. సో అతని టాలెంట్ తన సినిమాకు ఉపయోగపడుతుందని భావించిన చరణ్ ఇప్పుడు హుస్సెన్ ను సినిమాకు పనిచేయిస్తున్నాడు. కేవలం ఓ కామెడీ ఎపిసోడ్ కోసం అతన్ని తీసుకున్నట్టు టాక్. 

వినాయక్ డైరక్షన్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.