
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కన్ను ఇప్పుడు హీరోయిన్స్ మీద పడ్డదా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. దేవి ఓ మ్యూజిక్ డైరక్టర్ కాని అదెక్కటే చేస్తాడా డ్యాన్స్ వేస్తాడు, సాంగ్స్ పాడతాడు అదేముంది హీరోగా కూడా ప్రయత్నాలు మొదలెట్టాడని టాక్. అయితే ఇన్ని చేస్తున్న దేవి హీరోయిన్స్ తో కూడా తనలోని టాలెంట్ చూపించేస్తున్నాడట. ఇంతకీ దేవి చూపించే టాలెంట్ ఏంటి అంటే తనలోని ఫోటోగ్రఫీ ప్రతిభ.
ఇప్పటికే ఓ నెల క్రితం లావణ్య త్రిపాఠిని తన కెమెరాలో బందించిన దేవి ఇప్పుడు వేదికతో ఓ క్యూట్ ఫోటో షూట్ చేశాడు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ ఫోటో షూట్ లోని ఓ పిక్ వేదిక షోషల్ మీడియాలో పెట్టింది. దేవి చేతిలో పడ్డాక ఇక అమ్మడు ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. వేదికను చూసిన వారంతా ఈమె తెలుగులో ఎప్పుడు నటించలేదా అని డౌట్ పడుతున్నారు. ఆల్రెడీ తెలుగులో ఫ్లాప్ హీరోయిన్ అయిన అమ్మడు ఇప్పుడు కొత్త మెరుపులతో అందరిని ఆకట్టుకుంటుంది.