సుజీత్ దర్శకత్వంలో నాని... మెప్పించగలడా?

నేచురల్ స్టార్‌ నాని 32వ సినిమా యాక్షన్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటిస్తూ చిన్న గ్రాఫిక్ వీడియోని రిలీజ్ చేశారు. 

దర్శకుడు సుజీత్ వరసపెట్టి యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. ఇది కూడా యాక్షన్ సినిమాయే అని వీడియో చూస్తే అర్థమవుతుంది. కానీ నేచురల్ స్టార్ నాని అటువంటి యాక్షన్ పాత్ర చేసి ప్రేక్షకులను మెప్పించగలడో లేదో?     

ఈ సినిమాకి కధ, దర్శకత్వం సుజీత్ చేస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.