సంబంధిత వార్తలు
ప్రియదర్శి, శ్యామ్, శ్రీద, మణికందన్, నిరంజన్ అనూప్, భద్రం ప్రధాన పాత్రలలో ఓ క్రైమ్ థ్రిల్లర్ వస్తోంది. అయితే ఈ సినిమాకి టైటిల్ అచ్చమైన తెలుగులో ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అని పెట్టడం విశేషం.
ఫిబ్రవరి 1న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మంచి-చెడు అనేది వ్యక్తులు, సందర్భాలని బట్టి ఏవిదంగా మారిపోతుందో ట్రైలర్‌లో చక్కగా చూపారు. ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కాబోతోంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నారాయణ చెన్న, సంగీతం: వివేక్ రామస్వామి-అభిషేక్, కెమెరా: జాక్సన్-సతీస్, ఎడిటింగ్: ఆంథోనీ, ఆర్ట్: హరి వర్మ చేశారు.