ఓం భీమ్ బుష్... నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్!

దశాబ్ధాలుగా ఫార్ములా సినిమాలను చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు సరికొత్త కధాంశాలతో సినిమాలు తీసి మెప్పిస్తున్నారు కొత్త దర్శకులు. తాజాగా శ్రీ హర్ష కొంగుగంటి రచించి దర్శకత్వం చేస్తున్న సినిమా టైటిల్‌ ‘ఓం భీమ్ బుష్’ (నో లాజిక్... ఓన్లీ మ్యాజిక్) అని ప్రకటించారు.

సినిమా టైటిల్‌ ఒక్కటే కాదు కధ కూడా చాలా భిన్నమైనదని ఫస్ట్-లుక్ పోస్టర్‌లోనే చెప్పేశారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేసిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ముగ్గురూ స్పేస్ సూట్స్ ధరించి ఫ్లయింగ్ సాసర్‌లో నుంచి ఓ భవనం ముందు దిగిన్నట్లు ఫస్ట్ గ్లిమ్స్‌లో చూపారు. అక్కడ వారికి దొరికిన ఓ కాగితంలో సినిమా కధ ఏమిటో దర్శకుడు చెప్పేశారు. ఈ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీహర్ష, సంగీతం: సన్నీ ఎంఆర్, కెమెరా: రాజ్ తోట, ఎడిటింగ్: విజయ్‌ దేవరకొండ వర్ధన్ కుమార్, యాక్షన్: వింగ్ చున్ అంజి, కొరియోగ్రఫీ: విజయ్‌ దేవరకొండ బిన్నీ, శిరీష్, వీఎఫ్ఎక్స్: బాలాజీ ముప్పల. ఈ సినిమాని వి.సెల్యూలాయిడ్, యూవీ క్రియెషన్స్ బ్యానర్లపై సునిల్ బలుసు నిర్మిస్తున్నారు.