రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జూ.ఎన్టీఆర్‌కు జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి అందాల నటి శ్రీదేవి, చిరంజీవి జంటగా తెలుగులో అనేక సినిమాలు చేశారు. కనుక ఇప్పుడు ఆమె కుమార్తె, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌కు జోడీగా చేస్తే చూడాలని మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్ళకు వారి నిరీక్షణ ఫలించబోతోంది. 

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ చేంజర్‌’ సినిమా పూర్తికాక మునుపే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సి-16 వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దానిలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించబోతోంది. ఆమె తండ్రి బోణీ కపూర్ స్వయంగా ఈ విషయం మీడియాకు తెలియజేశారు. ఏప్రిల్‌ నుంచి ఆర్‌సి-16 సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది.