.jpeg)
కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో గోపీచంద్, మాళవిక శర్మ, భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భీమా’ సినిమా ఫిబ్రవరి 16న విడుదల కావలసి ఉండగా మార్చి 8వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదే విషయం ధృవీకరిస్తూ మరో 20 రోజులలో మహా శివరాత్రికి భీమా వచ్చేస్తున్నాడంటూ, ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. కనుక మన హీరో ఫైటింగ్‌కి రమ్మనమని విలన్ గ్యాంగ్‌ని కవ్విస్తున్నట్లు పోస్టర్లో చూపారు. ఈ సినిమాలో నాజర్, రఘుబాబు, వెన్నెల కిషోర్, నరేష్, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, రోహిణి, పూర్ణ, నిహారిక ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హర్ష, సంగీతం: రవి బస్రూర్, కొరియోగ్రఫీ: డాక్టర్ రవి వర్మ, కెమెరా: స్వామి జె గౌడ, స్టంట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. భీమా సినిమాని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.